చిరంజీవి ఇంటి ముట్టడిపై తప్పుడు ప్రచారం

కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి ఇంటి ముట్టడికి తాము పిలుపు ఇచ్చినట్టు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం  జరుగుతోందన్నారు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ గద్దె తిరుపతిరావు. తమపై కొంత మంది  దుష్ప్రచారం   చేస్తున్నారని చెప్పారు.

ప్రశాంతంగా జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చాలని  కుట్రలు చేస్తున్నారని  ఆరోపించారు. చిరంజీవి ఇంటి ముట్టడికి,  అమరావతి జేఏసీకి  ఎటువంటి  సంబంధం లేదని స్పష్టం చేశారు. విజయవాడలో  జరుగుతున్న రౌండ్ టేబుల్  సమావేశంలో రాజధాని తరలింపుపై  చర్చిస్తున్నారు. రౌండ్ టేబుల్  సమావేశంలో  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో  పాటు  వివిధ రాజకీయ,  ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.

Latest Updates