కుటుంబ రాజకీయ చిత్రమ్‌!

హర్యానాలో ఈసారి లోక్‌‌సభ ఎన్నికల్లోనూ కుటుం బవారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఈఎన్నికల్లో నలుగురు మాజీ ముఖ్యమంత్రుల మనవళ్లు, ఇద్దరు మునిమనవళ్లు, రాజకీయంగా మరోఇద్దరు ప్రముఖుల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జాట్‌‌లు ఎక్కువగా ఉన్నహర్యానా రాజకీయాలను చౌతాలా, హూడా,బిష్ణోయ్‌ కుటుంబాలు శాసిస్తాయి.మాజీ సీఎంలు భజన్‌‌లాల్‌‌, దేవీలాల్‌‌, ఓంప్రకాశ్‌ చౌతాలా, బన్సీలాల్‌‌  మనవళ్లు మాత్రం తాము రాజకీయ వారసులుగా ఎన్నికల్లో పోటీచేయడంలేదని అన్నారు. ప్రజల్లో తమ కుటుంబాలపై గుడ్‌‌విల్‌‌ ఉన్నమాట నిజమేకాని, దాన్ని బట్టే ప్రజలు ఓటేయరని భివాణిమహేంద్రగఢ్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌‌ పార్టీ తరపున పోటీచేస్తున్న బన్సీలాల్‌‌ మనవరాలు శ్రుతి ఛౌధరి చెప్పారు. ఏ వర్క్స్‌ చేశామో ప్రజలు చూస్తున్నారు.

శ్రుతి తల్లి కిరణ్‌ ఛౌధరి కూడాభివాణ్‌ లోక్‌‌సభ నియోజకవర్గపరిధిలోని తోసమ్‌‌ అసెంబ్లీ సెగ్మెంట్‌‌కు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి బరిలో ఉన్న చౌతాలా మునిమనవళ్లు వేర్వేరుపార్టీల తరపున పోటీచేస్తున్నారు. కుటుంబంలో గొడవల వల్ల వాళ్లంతా కిందటేడారి విడిపోయారు. టీచర్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ స్కామ్‌‌తో సంబంధముందన్న ఆరోపణలపై ఓంప్రకాశ్‌ చౌతాలా జైల్లో ఉండడంతో ఆయన కుమారుడు అజయ్‌ చౌతాలా ఇండియన్‌‌ నేషనల్‌‌ లోక్‌‌ దళ్‌‌ (ఐఎన్‌‌ఎల్డీ) నుంచి బయటకువెళ్లి, జన్‌‌నాయక్‌‌ జనతా పార్టీని ( జేజేపీ) పెట్టారు. ఈపార్టీరాష్ట్రంలో ఆమ్‌‌ ఆద్మీపార్టీతో పొత్తు పెట్టుకుంది.

హిస్సార్‌‌లో ప్రముఖుల మనవళ్లు:
రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌‌ హబ్‌ గా ఉన్న హిస్సార్‌‌  రాజకీయంగా కూడా కీలకమైన నియోజకవర్గం గాచెబుతారు. ఈ నియోజకవర్గంలో పోటీచేస్తున్న ముగ్గురూ ప్రముఖ రాజకీయ నాయకుల మనవళ్లు కావడం విశేషం. భజన్‌‌లాల్‌‌ మనవడు భవ్య బిష్ణోయ్‌ కాంగ్రెస్‌‌ తరపున, ఓంప్రకాశ్‌ చౌతాలా మనవడు దుష్యంత్‌ చౌతాలా జేజేపీ-ఆప్‌ కూటమి తరపున, కేంద్రమాజీ మంత్రి బీరేంద్ర సింగ్‌ కుమారుడు, ప్రముఖరైతు నాయకుడు ఛోటూరామ్‌‌ మనవడు బ్రిజేంద్రసింగ్‌ బీజేపీ తరపున పోటీచేస్తున్నారు. గురుగ్రామ్‌‌ నుంచి మాజీ సీఎం రావ్‌‌ బీరేంద్ర సింగ్‌ కుమారుడు, కేంద్రమంత్రి ఇంద్రజిత్‌ సింగ్‌ పోటీచేస్తున్నారు.

సిట్టింగ్‌ ఎంపీ కూడా అయిన ఇంద్రజిత్‌ కాంగ్రెస్‌‌తో తెగతెంపులు చేసుకుని 2014 లోక్‌‌సభ ఎన్నికలముందు బీజేపీలో చేరారు. హర్యానా మాజీ స్పీకర్‌‌, కులదీప్‌ శర్మ కాంగ్రెస్‌‌ అభ్యర్ధిగా కర్నాల్‌‌ నుంచి పోటీచేస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇంతకుముందు ఆయన తండ్రి ఛిరంజిలాల్‌‌ నాలుగు సార్లు వరసగా పోటీచేసి గెలిచారు. బీజేపీలో కీలకనేతగా ఉన్న సుష్మా స్వరాజ్‌‌ను కూడా ఆయన ఓడిం చారు.

హుడా కుటుంబం:
హుడా కుటుంబానికి చెందినవారు కూడా ఈసారి బరిలో ఉన్నారు. మాజీ సీఎం భూపేందర్‌‌ సింగ్‌ హుడా సోనేపట్‌‌ నుంచి, ఆయన కుమారుడు దీపీందర్‌‌ సింగ్‌ హుడా రోహతక్‌‌ నుంచి పోటీచేస్తున్నారు. సిట్టింగ్‌ ఎంపీ కూడా అయిన దీపీందర్‌‌ సింగ్‌ హుడా గత లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ తరపున గెలిచిన ఒకేఒక అభ్యర్థి కావడం విశేషం.

 

బన్సీలాల్‌ ఫ్యామిలీ మెంబర్స్‌‌
శ్రుతి ఛౌధరి (మనవరాలు)- భివాణి-
మహేంద్రగఢ్‌ నియోజకవర్గం (కాం గ్రెస్‌ )

భజన్‌ లాల్‌ కుటుంబ సభ్యులు
భవ్య బిష్ణో య్‌ ( మనవడు)- హిస్సార్‌‌ (కాం గ్రెస్‌ పార్టీ)

ఓంప్రకాశ్‌ చౌతాలా ఫ్యామిలీ ట్రీ
దుష్యం త్‌ చౌతాలా ( మనవడు) -హిస్సార్‌‌ ( జేజేపీ-ఆప్‌ కూటమి)
దిగ్విజయ్‌ చౌతాలా- (మనవడు) -సోనేపట్‌ ( జేజేపీ-ఆప్‌ కూటమి)
అర్జు న్ చౌతాలా (ముని మనవడు) కురుక్షేత్ర (ఐఎన్‌‌ఎల్డీ)
మాజీ సీఎం భూపేందర్‌‌ సింగ్‌‌ హుడా-సోనేపట్‌ (కాం గ్రెస్‌ )
దీపీం దర్‌‌ సింగ్‌‌ హుడా (కుమారుడు)-రోహతక్‌ (కాం గ్రెస్‌ )

Latest Updates