కృషితో నాస్తి దుర్భిక్ష్యం ..23ఏళ్ల‌కే ఐఏఎస్

కృషితో నాస్తి దుర్భిక్ష్యం అన్నారు పెద్ద‌లు . అనుకున్న ల‌క్ష్యం సాధించాల‌నే ప‌ట్టుద‌ల ఉండాలే కానీ ప్ర‌కృతి అనుకూలించ‌క‌పోయినా, ప్ర‌పంచం అంతా ఏక‌మైనా అనుకున్న‌ ల‌క్ష్యాన్ని చేధించ‌డానికి ఏదీ అడ్డు కాదు అని నిరూపించారు ఈ 23ఏళ్ల ప్ర‌తీప్ సింగ్. ఇటీవ‌ల విడుద‌లైన‌ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప‌రీక్షా ఫ‌లితాల్లో 26ర్యాంక్ సాధించారు.

ఇండోర్ కు చెందిన మనోజ్ సింగ్ పెట్రోల్ బంక్ లో గుమ‌స్తా. ఆయ‌న కుమారుడు ప్ర‌దీప్ సింగ్ . చిన్న వ‌య‌సు నుంచి ప్ర‌దీప్ ఐఏఎస్ కావాల‌నే కోరిక బ‌లంగా ఉండేది. ప్ర‌దీప్ కు కోరిక మ‌ద్దుత‌గా త‌ల్లిదండ్రులు అండ‌గా నిలిచారు.

చాలీచాల‌ని జీతంతో కుటుంబ పోష‌ణ‌కు భార‌మైన కుమారుడి కోసం అనేక త్యాగాలు చేశారు. ఆ త్యాగాల‌కు ప్ర‌తిఫ‌ల‌మే సివిల్ స‌ర్వీస్ లో 26ర్యాంక్ సాధించేలా చేసింది.

2018లో ఐఏఎస్ కు ప్ర‌య‌త్నించ‌గా ఫ‌స్ట్ అటెంప్ట్ లో 93వ ర్యాంక్ ను సాధించి ఐఏఎస్ సాధించ‌లేక‌పోయారు. త‌నకొచ్చిన ర్యాంక్ తో ఇండియ‌న్ రెవెన్యూ స‌ర్వీస్ లో జాబ్ సంపాదించుకున్నారు. అయినా స‌రే ఐఏఎస్ అవ్వాల‌నే ల‌క్ష్యంతో అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డి ఐఏఎస్ కు సెల‌క్ట్ అయిన‌ట్లు ప్ర‌దీప్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా తండ్రి మ‌నోజ్ సింగ్ మాట్లాడుతూ క‌ఠిన ప‌రీక్ష‌లో నాకుమారుడు విజ‌యం సాధించాడు. నా కుమారుడి ల‌క్ష్యం నెర‌వేర్చేందుకు ఇల్లును అమ్మేశాను. ఇప్పుడు చాలా సంతోషం గా ఉందంటూ కుమారుడిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

Latest Updates