ఒకే ఫ్యామిలీకి చెందిన న‌లుగురు సూసైడ్

రంగారెడ్డి జిల్లా: ఒకే ఫ్యామిలీకి చెందిన న‌లుగురు సూసైడ్ చేసుకున్న దారుణ సంఘ‌ట‌న బుధ‌వారం సాయంత్రం మీర్ పేట్ లో జరిగింది. మీర్ పేట్, అల్మాస్ గూడలోని ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

వికారాబాద్ జిల్లా థరూర్ మండలం దోర్నకల్ గ్రామానికి చెందిన సువర్ణభాయ్(55) తన కొడుకులు హరీష్(30), గిరీష్(27), కూతురు స్వప్న(23)తో కలిసి అల్మాస్ గూడ‌లోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటోంది. కొంత కాలంగా అనారోగ్యం, ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడంతో నలుగురు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విష‌యాన్ని వారు సూసైడ్ నోట్ లో రాసి చ‌నిపోయిన‌ట్లు తెలిపారు స్థానికులు.

‘‘నా ఆరోగ్యం కోసం చాలా దేవుళ్ళ దగ్గర వెళ్ళాము. అయిన మాకు తక్కువ కానందున ఈ విధంగా చేస్తున్నాము. మందుల కోసం మా వద్ద ఉన్న డబ్బులు, గోల్డ్ ఖర్చు అయ్యాయి. మేము ఆత్మహత్య చేసుకుంటున్నాము. అని రాసిన సూసైడ్ నోట్ తో పాటు ఈ డోర్ తెరవండి ప్లీజ్ అని రాసి ఉన్న బోర్డును గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న మీర్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలు పడి ఉన్న రూమ్ లో క్లూస్ సేకరించారు. ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో.. మీర్ పేట్ ఇన్ స్పెక్టర్ నర్సింగ్ యాదయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Latest Updates