ఇన్సూరెన్స్ డబ్బు ల కోసం చంపించుకున్నాడు

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేని ఒక వ్యక్తి తనను తానే హత్య చేయించుకున్నాడు. తాను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని భావించాడు. తనను హత్య చేసేందుకు బాల నేరస్థుడు సూరజ్‌తో రూ.60వేలకు కాంట్రాక్ట్ ‌కుదుర్చుకున్నాడు. ఢిల్లీలోని ఆర్య నగర్ ఐపీ ఎక్స్ ‌టెన్షన్‌‌లో భార్య, పిల్లలతో ఉన్న గౌరవ్ భన్సల్‌ ‌రేషన్ షాపు నడుపుకునేవాడు. దీంతో కుటుంబం గడవడం కష్టమని భావించే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పారు. బన్సల్‌‌కు ఇన్సూరెన్స్ ఎంత వస్తుందనేది ప్రస్తుతానికి తెలీదని, సుమారు రూ.10 లక్షలు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఔటర్ ఢిల్లీ నజాఫ్‌‌ఘర్‌ ‌‌‌దగ్గరలోని ఖేరీ బాబా పుల్ దగ్గర ఒక చెట్టుకు వేలాడుతున్న బన్సల్‌ ‌డెడ్ బాడీని ఈనెల 10న పోలీసులు గుర్తించారు. అతని చేతులు కట్టేసి ఉండడంతో పోలీసులు మర్డర్  కేసుగా రిజిస్టర్‌‌‌‌ చేసి ఇన్వెస్టిగే షన్ మొదలుపెట్టారు. అనుమానంతో ఉత్తమ్‌‌ నగర్‌‌‌‌లోని ఉండే సూరజ్‌ అతని అనుచరులను విచారించగా ఈ విషయం బయటపడింది. ఇన్సూరెన్స్ డబ్బులకోసమే చంపించుకున్నట్టు నిందితులు చెప్పారు.

 

Latest Updates