అవెంజర్ చూస్తూ కుప్పకూలిన యువతి..హస్పిటల్ కు తరలింపు

సినిమాల ప్రభావం మనుషులపై ఇంతలా ఉంటుందా అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. ఇటీవల వచ్చిన హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్‌’ సిరీస్‌ కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్‌ ఉందో అందరికి తెలుసు. గత సిరీస్‌ లతో పోలిస్తే..  ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ ప్రేక్షకుల చేత విపరీతంగా కంటతడి పెట్టిస్తోంది. ఎంతలా అంటే సినిమా చూసి ఏడ్చి ఏడ్చి ఓ ప్రేక్షకురాలు హస్పిటల్ పాలైంది.  చైనాకు చెందిన జియాలియా(21) అనే యువతి ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ సినిమా చూస్తూ తీవ్ర ఉద్రేగానికి లోనయ్యి..థియేటర్ లోనే ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిందట. అది కాస్తా హై లేవల్‌ కు చేరడంతో పాపం ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంది.

పరిస్థితిని గమనించిన జియాలియా స్నేహితులు ఆమెను వెంటనే హస్పిటల్ కు  తరలించారు. డాక్టర్లు ఆమెకి చికిత్స చేసి.. మామూలు స్థితికి తీసుకువచ్చారు. సినిమా చూసేటప్పుడు లైట్ తీసుకోవాలి తప్ప..ఇలా టెన్షన్ ఫీల్ కాకూడదని తెలిపారు డాక్టర్లు. హారర్ మూవీస్ చూస్తూ కొందరు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు డాక్టర్లు. ప్రస్తుతం జియాలియా కోలుకుంటుందని తెలిపారు.

Latest Updates