వీడియో: విజయ్ దేవరకొండకు ’బీరాభిషేకం‘ చేసిన ఫ్యాన్స్

ఫ్యాన్స్ అభిమానానికి హద్దు లేకుండా పోతోంది. తమ అభిమాన హీరో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. రౌడీస్ అంటూ తన ఫ్యాన్స్‌ను ప్రేమగా పిలిచే విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాను కరణ్ జోహర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ఆ పోస్టర్‌లో విజయ్.. సింహం, పులి రెండింటి కలయికగా ఉన్నాడు. చేతులకు గ్లోవ్స్‌తో ఉన్న విజయ్‌ను చూస్తే.. ఈ సినిమా బాక్సింగ్ ప్లేయర్‌కు సంబంధించినదిగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను చూసిన ఆయన అభిమానులు ఉత్సాహంతో ఉరకలెత్తారు. విజయ్ పోస్టర్‌కు ఏకంగా బీర్‌తోనే అభిషేకం చేశారు. ఆ వీడియోను విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అఫిషీయల్ పేజీలో పోస్ట్ చేశారు. ‘నీళ్లు, పాలు వేస్ట్ చేయోద్దు, కానీ బీర్ వేస్ట్ చేయోచ్చు’ డోన్ట్ వేస్ట్ వాటర్, డోన్ట్ వేస్ట్ మిల్క్, బట్ యూ కెన్ వేస్ట్ బీర్స్ అంటూ ట్యాగ్ చేశారు.

ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా.. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ బాషలలో నిర్మిస్తున్నారు.

For More News..

పెళ్లైన మూడు నెలలకే సూసైడ్ చేసుకున్న ఎస్సై

కిరాయికి వ్యవసాయ పనిముట్లు.. సెంట్రల్ గవర్నమెంట్ సరికొత్త స్కీం

మనుషులకే కాదు.. పసులకూ ఓ హాస్టల్

Latest Updates