నువ్వంటే చచ్చిపోతా అన్నా..! మహర్షి వేడుకలో కలకలం

సూపర్ స్టార్ మహేశ్ బాబు అంటే ఫ్యాన్స్ లో ఎంత క్రేజ్ ఉందో చెప్పే సంఘటన ఇది. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో జరిగిన మహర్షి ప్రి-రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో అభిమానులు వచ్చారు. మహేశ్ బాబు మాట్లాడుతుండగా రెండుసార్లు అభిమానులు స్టేజీపైకి వచ్చారు.

మహేశ్ బాబు తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ గురించి చెబుతుండగా… ఓ అభిమాని సడెన్ గా డయాస్ పైకి వచ్చేశాడు. “అన్నా అన్నా.. నువ్వంటే చచ్చిపోతా అన్నా..” అంటూ ఏడుస్తూ దగ్గరకు దూసుకురావడంతో… థాంక్స్ అని మహేశ్ చెప్పాడు. అతడికి ఆప్యాయంగా హగ్ ఇచ్చాడు. అతడు మరో హగ్ కోసం ప్రయత్నం చేస్తుండటంతో… సెక్యూరిటీ అక్కడినుంచి అతడిని పంపించేశారు.

మరో సందర్భంలో ఇంకో ఫ్యాన్ డయాస్ పైకి వచ్చాడు. తనమీదకొచ్చిన అభిమానిని ఈసారి మహేశ్ చేయి అడ్డు పెట్టి దూరం పెట్టాడు. సెక్యూరిటీ వాళ్లు అతడిని దింపేశారు మహేశ్ వడివడిగా తన ప్రసంగం ముగించేసి.. అభిమానులకు థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు.

Latest Updates