రైతులు బిర్యానీలు తింటూ బర్డ్ ఫ్లూను వ్యాప్తి చేస్తున్నారు

జైపూర్: దేశంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిని రైతుల ఆందోళనలకు ముడిపెడుతూ రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలను కొనసాగిస్తున్నారు. అయితే ఈ నిరసనల్లో పాల్గొంటున్న రైతులు చికెన్ బిర్యానీలు తింటూ బర్డ్ ఫ్లూ వ్యాప్తిని పెంచుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ ఆరోపించారు. దేశంలో ఇలాంటి విపత్తును సృష్టించాలని చూసే వారు టెర్రరిస్టులు, బందిపోట్లు, దొంగలతో సమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రైతులు బిర్యానీలు, కాజూ-బాదామ్‌‌లు తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ నిరసనల్లో చాలా మంది ఉగ్రవాదులు కూడా ఉన్నారు. అలాగే దొంగలు, బందిపోట్లు కూడా ఉన్నారు. వాళ్లే రైతుల శత్రువులు. అలాంటి వాళ్లను ప్రభుత్వం ఏరివేయకపోతే దేశంలో బర్డ్ ఫ్లూ సమస్య అధికమవుతుంది’ అని దిలావర్ చెప్పారు.

Latest Updates