కొత్త అగ్రి చట్టాల ప్రయోజనాలను రైతులు అర్థం చేసుకుంటారు

న్యూఢిల్లీ: కొత్త అగ్రి చట్టాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని రైతు సంఘాలు అర్థం చేసుకుంటున్నాయని భావిస్తున్నామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. రైతు సంఘాలతో జరుపుతున్న చర్చలు కొలిక్కి వస్తాయని అనుకుంటున్నట్లు చెప్పారు. కొత్త అగ్రి చట్టాలతో తమకు కలిగే ప్రయోజనాలను రైతు యూనియన్లు అర్థం చేసుకుంటాయని తోమర్ తెలిపారు. ‘రైతుల శ్రేయస్సుకు భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టాలకు మద్దతు తెలుపుతున్న వారితోపాటు వ్యతిరేకిస్తున్న అన్నదాతలనూ మేం కలిశాం. ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారు వాటి ప్రయోజనం గురించి తెలుసుకున్నాక చర్చలకు సామరస్యంగా ఫుల్‌‌స్టాప్ పెట్టడానికి సహకరిస్తారని భావిస్తున్నాం’ అని తోమర్ పేర్కొన్నారు.

Latest Updates