నేరం మోపారని రైతు ఆత్మహత్య

ఉపసర్పంచిపై మృతుడి భార్య ఫిర్యాదు

దుబ్బాక, వెలుగు: తనపై దొంగతనం నేరం మోపారని మనస్తాపానికి గురైన ఓ రైతుఈ  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్దమాసాన్​పల్లిలో చోటుచేసుకుంది. ట్రాక్టర్  బ్యాటరీ దొంగతనం చేశాడని, కేసు పెడతానని పెద్దమాస్ పల్లి ఉపసర్పంచి బెదిరించడంతో రైతు తాళ్ల యాదగిరి(38) పురుగులమందు తాగాడని పోలీసులు తెలిపారు. జనవరి 27న తన భార్య బాలవ్వతో కలిసి  హైదరాబాద్​కు వెళ్లిన యాదగిరిని భూమి దున్నడానికి రమ్మని రాజిరెడ్డి ఫోన్ చేసి పిలిపించాడు.

ఆ తర్వాతి రోజు యాదగిరి వ్యక్తిగత పనులమీద సిద్దిపేటకు వెళ్తుండగా ఎన్సాన్​పల్లి వద్ద ఆపి..  ట్రాక్టర్ బ్యాటరీ దొంగిలించి అమ్ముకున్నావని, కేసు పెడతానంటూ ఉపసర్పంచ్ బెదిరించడంతో మనస్తాపానికి గురైన యాదగిరి జనవరి 31న గ్రామంలోని వ్యవసాయ భూమి వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు చికిత్స నిమిత్తం హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా ట్రీట్​మెంట్ పొందుతూ సోమవారం చనిపోయాడని పోలీసులు తెలిపారు. బాలవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest Updates