అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

పాలకుర్తి, వెలుగు: పంట దిగుబడి రాక..అప్పు తీర్చలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లిజిల్లా బసంతనగర్ పోలీసులవివరాల ప్రకారం.. పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన రైతు బోయిని తిరుపతి(38)కి 5 ఎకరాల పొలం ఉంది. వ్యవసాయ పెట్టుబడులు, ఇతర కుటుంబ అవసరాల నిమిత్తం రూ.12 లక్షలు అప్పు చేశాడు. పంటకు దిగుబడి రాక మనోవేదనకు గురయ్యాడు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి వద్ద పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు తిరుపతిని పెద్దపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతిచెందాడు.

 

Latest Updates