అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

నేలకొండపల్లి, వెలుగు: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని  బోడులబండ  గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన అనంతు సీతారాములుకు రెండెకరాల పొలం ఉంది. దీంతోపాటు ప్రతి సంవత్సరం మామిడి తోటలు కౌలుకు తీసుకుంటూ ఉంటారు. రెండేళ్లుగా మామిడి తోటల్లో దిగుబడి లేక రూ. 12 లక్షల వరకు అప్పయింది.

అప్పు ఇచ్చినవాళ్లు డబ్బుల కోసం ఇంటికి రావడంతో మనస్తాపానికి గురై బుధవారం గ్రామం పక్కనే ఉన్న మామిడి తోటలో పురుగుల మందు తాగాడు. పక్క పొలం రైతులు వెంటనే  నేలకొండపల్లి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. సీతారాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Latest Updates