లోను కట్టాలంటూ ట్రాక్టర్ స్వాధీనం.. బ్యాంకు ఎదుట రైతు ఆందోళన

నేరేడుచర్ల, వెలుగు: లోను కట్టాలంటూ సహకార బ్యాంకు ఆఫీసర్లు ఓ రైతు ట్రాక్ట‌ర్ ను స్వాధీనం చేసుకోవడంతో, అతడు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగాడు. ఈ సంఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం, రాయినిగూడెం సహకార బ్యాంకు వద్ద జరిగింది. మండలంలోని కొత్త గూడెం గ్రామానికి చెందిన యాదగిరిరెడ్డి అనే రైతు ట్రాక్ట‌ర్ కొనేందుకు సహకార బ్యాంకు నుంచి రూ. 9 లక్షల లోను తీసుకున్నాడు. ఇప్పటికే సంవత్సరానికి రూ. లక్ష చొప్పున 7 కిస్తీలు కట్టగా, జనవరిలో ఎనిమిదో కిస్తీ కట్టాల్సి ఉంది. అయితే డబ్బులు కట్టక పోవడంతో మంగళవారం బ్యాంకు ఆఫీసర్లు ట్రాక్ట‌ర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు ట్రాక్ట‌ర్ ఇస్తేనే వెళ్తానని ఆఫీస్ ఎదుట బైఠాయించాడు. దీంతో స్పందించిన బ్యాంకు ఆఫీసర్లు రెండు నెలల్లో డబ్బులు చెల్లించాలని చెప్పి ట్రాకర్ ను ఇచ్చి పంపించేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం