ఏపీ సచివాలయం వద్ద ఉద్రిక్తత

ఏపీ సచివాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ అధికారులకు రైతుకు మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో రైతుతో పాటు అతనికి మద్దతుగా నిలిచిన వారిని అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపించారు పోలీసులు. రాజధాని కోసం భూమివ్వని పొలంలో అధికారులు రోడ్డేసేందుకు యత్నించారు. భూయజమాని గద్దెమేర ప్రసాద్ వారిని అడ్డుకున్నాడు. హైకోర్టు ఇచ్చిన స్టే చూపించాడు. రైతు ప్రసాద్ కు స్థానిక రైతులు, వైసీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అధికారులు రోడ్డేసి తీరుతామనడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. రైతుతో పాటు అతనికి మద్దతుగా నిలిచిన వారందరిని అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కు పంపించారు పోలీసులు.

 

 

Latest Updates