పరిహారం అడిగిండని రైతును స్టేషన్ల పెట్టిన్రు

తిమ్మాపూర్, వెలుగు: నష్టపరిహారం వచ్చే దాకా తన భూమిలో మిడ్‌‌ మానేరు కాల్వ పనులు చేయొద్దని అడ్డుకున్న రైతును రోజంతా పోలీస్‌‌ స్టేషన్‌‌లో పెట్టడం వివాదాస్పదమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో మిడ్‌‌ మానేరు లింకు కెనాల్ పనులు జరుగుతున్నాయి. 8 ఏళ్ల క్రితం తోటపల్లి రిజర్వాయర్, దాని కాల్వల కోసం ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకుంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తోటపల్లి రిజర్వాయర్‌‌ను రద్దు చేసినా సాయబ్‌‌ పల్లి, బాలయ్యపల్లెలో సేకరించిన భూముల్లో తాజాగా ఈ కెనాల్స్‌‌ నిర్మిస్తున్నారు. ఇందులో సాయబ్ పల్లికి చెందిన దుర్గం నర్సయ్య భూమి (1.36 ఎకరాలు) కూడా ఉంది. అప్పట్లో రైతులకు ఎకరానికి రూ.3 లక్షలు పరిహారం ప్రకటించగా సరిపోదంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పరిహారం తక్కువుందని నర్సయ్య కూడా తీసుకోలేదు. దీంతో ఆయన ఇవ్వాల్సిన మొత్తాన్ని ఆఫీసర్లు కోర్టులో డిపాజిట్ చేసి పనులు చేస్తున్నారు. అయితే పరిహారం వచ్చేదాకా తన భూమిలో పనులు జరగనివ్వనంటూ నర్సయ్య మంగళవారం అడ్డుకున్నాడు. దీంతో ఇరిగేషన్ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా వాళ్లు నర్సయ్యను స్టేషన్‌‌కు తీసుకెళ్లి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ఆఫీసర్లు ఫిర్యాదు చేయడంతో బ్లూ కోట్స్​ సిబ్బందిని పంపి రైతు నర్సయ్యను పోలీస్‌ స్టేషన్‌‌కు తీసుకొచ్చామని, కేవలం కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చి పంపామని, నిర్బంధించలేదని తిమ్మాపూర్‌‌ ఎస్సై నరేష్‌‌రెడ్డి చెప్పారు.

భారత్ లో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

Latest Updates