పట్టా పాస్ బుక్ లో తప్పులు.. రైతు ఆత్మహత్యాయత్నం

నారాయణపేట: కొత్త పాస్ బుక్ లో తనకు ఉండాల్సిన భూమి వివరాలు తక్కువగా వచ్చాయని ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ రైతు. పాత పాస్ పుస్తకంలో 2 ఎకరాల 24 గుంటలు ఉండగా..కొత్త పాస్ బుక్ లో ఒక్కటే గుంట భూమి ఉన్నట్లు వచ్చింది. దీంతో మనో వేధనకు గురైన రైతు జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు పురుగులు మందు తాగి ఆత్మహత్యయత్నం చేశాడు. ఈ సంఘటన శనివారం నారాయణపేట జిల్లాలో జరిగింది.

రైతును దామర్ గిద్దా మండలం క్యాథన్ పల్లి గ్రామానికి చెందిన నర్సింహులుగా గుర్తించిన పోలీసులు..నారాయణపేట ప్రభుత్వ హస్పిటల్ కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగానే ఉందని తెలిపారు డాక్టర్లు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ పాస్ బుక్ వివరాలను.. పట్టా నంబరును పరిశీలించాల్సిందిగా తహసీల్దారును ఆదేశించారు.

 

Latest Updates