ఆవిర్భావ వేడుకల్లో రైతు ఆత్మహత్యాయత్నం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు కొన్ని చోట్ల నిరసనలకు దారి తీశాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ దగ్గర ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో నిరసనకు దిగాడు. భూరికార్డుల్లో తన పేరు నమోదు చేయడం లేదంటూ యువకుడు నిరసనకు వ్యక్తం చేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుడిని పోలీసు స్టేషన్ కి తరలించారు. యువకుడు మహదేవ్ పూర్ కు చెందిన మధుగా గుర్తించారు. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ వ్యవసాయ భూమిని వేరే వారికి పట్టా చేశారని తెలిపాడు రైతు మధు.

Latest Updates