ఎంఆర్వో ఆఫీస్ ముందు రైతన్న ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం..

పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భూమిని ఆన్ లైన్ చేయడం లేదంటూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మందల రాజిరెడ్డి సూసైడ్ నోట్ రాసి కాల్వ శ్రీరాంపూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రాజిరెడ్డి తనకున్న ఎకరం 20 గుంటల భూమిని తన పేరు మీదికి ఎక్కించాలని కొన్ని నెలలుగా తహశీల్దార్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. అయితే అధికారులెవరూ ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదని మనస్తాపంతో కలెక్టర్ కు సూసైడ్ నోట్ రాసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తహశీల్దార్, వీఆర్వోల పేర్లతో సూసైడ్ నోట్ రాసి రాజిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి దగ్గరి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

దేశవ్యాప్తంగా 24 గంటల్లో 14,516 కరోనా కేసులు

మందు తాగి డ్యూటీ చేస్తున్న పోలీసులు

వెంటిలేటర్ ప్లగ్ తీసి కూలర్ ప్లగ్ పెట్టిన కుటుంబసభ్యులు.. ఊపిరాడక..

Latest Updates