పెట్రోల్ పోసి తగలబెడతా.. తహశీల్దార్ కు రైతు బెదిరింపు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో తహశీల్దార్ పై బెదిరింపులకు దిగాడు ఓ రైతు.  పెట్రోల్  బాటిల్ తీసుకుని  తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు రైతు. తన పట్టా పాస్ బుక్ ఇవ్వకపోతే పెట్రోలో పోసి తగలబెడతా అంటూ బెదిరించాడు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు  పోలీసులు  కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం తిరుమాలాయా పాలెం మండలంలోని బాలాజీ నగర్ గ్రామ పంచాయతీ శివారు రమణా తండాకు చెందిన చందావత్ వాల్యా పెట్రోల్ బాటిల్ సంచిలో పెట్టుకొని తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళాడు. తాను కొన్న 12 కుంటల భూమి పట్టా చేయకపోతే పెట్రోలు పోసి తగలబెడతానని బెదిరించాడు. తహశీల్దారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈ విషయంపై తహశీల్దార్ ను  వివరణ కోరగా వెదుల్ల చెరువు రెవెన్యూ పరిధిలోని 109 సర్వే నెంబర్ లోని 2.12 ఎకరాల భూమి ఉందని. ఆ భూమిలో రెండు ఎకరాలు పట్టా పాస్ పుస్తకాలు వచ్చినట్లు చెప్పారు. అయితే రైతు చెబుతున్న మిగతా 12 కుంటల భూమికి సంబంధించి తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదన్నారు తహశీల్దార్.

Latest Updates