అన్యాయంగా రైతులను జైలుకు పంపుతున్నారు: కోదండరాం

యాదాద్రి భువనగిరి : భూములకు నష్టపరిహారం అడిగితే రైతులను జైలుకు పంపడం సిగ్గు చేటని అన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని బస్వాపూర్ రిజర్వాయర్ కింద భూములు, ఇండ్లు కోల్పోతున్న బస్వాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అనే ధోరణి మానుకోవాలన్నారు కోదండరామ్.

బస్వాపూర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన భూనిర్వాసితులకు 2013 చట్టం ప్రకారం  నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే ప్రాజెక్ట్ నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో మహిళలు, గ్రామస్తులు నష్టపరిహారం, పునరావాసంపై ప్రభుత్వ చర్యలను అడిగి తెలుసుకున్నారు కోదండరామ్.

Latest Updates