ఫారెస్ట్ అధికారులపై రైతుల దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం గుండాలపాడు పంచాయతీ పరిధిలో.. అటవీ అధికారులపై అర్థరాత్రి పోడు సాగుదారులు దాడి చేశారు. నిన్న అర్థరాత్రి పోడు భూములను ట్రాక్టర్లతో దున్నుతున్నారన్న సమాచారంతో.. ములకలపల్లి అటవీ అధికారుల బృందం వెళ్లింది. అక్కడ ట్రాక్టర్లకు కాపలాగా ఉన్న కొందరు.. ఫారెస్ట్ అధికారుల రాకను గమనించి గ్రామస్థులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు దుక్కి దున్నే మూడు ట్రాక్టర్లను తీసుకొని బేస్ క్యాంప్ కు వస్తున్న సమయంలో.. స్థానికులు కర్రలతో దాడిచేశారు. తమ దగ్గర ఉన్న సెల్ ఫోన్లను లాక్కున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. తీవ్ర గాయాలైన అధికారులను.. ఉన్నతాధికారులు ములకలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం అటవీ శాఖ ఉన్నతాధికారులు జిల్లా పోలీసులకు పిర్యాదు చేసినట్లు తెలిసింది.

Latest Updates