త‌హ‌సీల్దార్ అండ‌తో భూములు లాక్కున్నారంటూ రైతుల ఆందోళన

కీసర తహసీల్దార్ నాగరాజు అండ‌తో ప్రైవేట్ వ్యక్తులు త‌మ‌ భూములను లాక్కోవాలని చూస్తున్నారంటూ శ‌నివారం రాంప‌ల్లి దాయ‌ర వ‌ద్ద రైతులు ఆందోళ‌న చేశారు. ఎన్నో సంవ‌త్స‌రాలుగా తాతల నాటి భూమిలొనే వ్యవసాయం చేసుకుంటున్నామ‌ని.. అయితే ఈ మధ్య కొందరు మా భూముల వద్దకు వచ్చి, కొనుగోలు చేశామ‌ని బెదిరించార‌ని చెబుతున్నారు. దీనిపై కోర్టులో కేసులు ఉన్నకారణంగా అమ్మడం.. కొనుగోళ్లు జరగవు అనే నమ్మకంతో ఉంటున్నామ‌ని తెలిపారు.

అయితే ఏసీబీ దాడుల‌తో కీస‌ర త‌హ‌సీల్దార్ అవినీతి తెలియ‌డంతో.. న్యాయం కోసం పోరాటం చేస్తామంటున్నారు. మా భూమి మాకు చెందుతుంద‌ని తెలిపారు. ఈ వ్య‌వ‌హారంలో చాలా మంది పాత్ర‌లు ఉన్నాయ‌ని.. ఇన్ని రోజులు పాస్ పుస్తకాలు ఇవ్వమంటే త‌హ‌సీల్దార్ కోర్టు కేసు ఉందని ఇవ్వలేదని తెలిపారు. భూముల‌ వ్య‌వ‌హారంపై చాలా కాలంగా కోర్టులో కేసు నడుస్తుందని తెలిపారు రైతులు.

Latest Updates