తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల రాస్తారోకో

హాలియా, వెలుగు : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ శనివారం నల్గొం డ జిల్లా హాలియా మార్కె ట్ యార్డు ఎదుట రైతులు రాస్తా రోకో  చేశారు. ఈ సందర్భంగారైతు సంఘం జి ల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయిందన్నారు.కొనుగోలు కేం ద్రాల వద్ద తగిన సౌకర్యా లు కల్పించకపోవడంతో రైతుల ధాన్యం తడిసిందని విమర్శించారు. తేమ పేరుతో మిల్లర్ లు రైతుల ధాన్యాన్ని తక్కువ ధర కే అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద దళారులు చేరి రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సన్న, చిన్నకారు రైతులకు బస్తాలు ఇవ్వకుం డా బయట కొనుగోలుచేసేవారికి ఇస్తున్నారని, సీరియల్, టోకెన్ లేకుండా పైరవీకారులకే బస్తాలు ఇస్తున్నారని మండిపడ్డారు.రెవెన్యూ అధికారులు వచ్చి సముదాయించడంతో రైతులు ఆందోళన విరమించారు.

Latest Updates