పసుపు బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలంటూ ఆర్మూర్ రైతుల ధర్నా

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రైతుల ధర్నాకు దిగారు.  పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై ఆందోళన  చేశారు. దీంతో అక్కడ భారీగా ట్రాఫ్ జామ్ అయ్యింది. పార్టీలకతీతంగా రైతులంతా ఈ ధర్నాలో  పాల్గొన్నారు. వెంటనే  పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28 తేదీలోగా డిమాండ్లను పరిష్కరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గడువు ఇచ్చారు రైతులు. లేకుంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

Latest Updates