నిరసనలు ఎందుకు చేస్తున్నారో రైతులకే తెలియదు

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు ఎందుకు చేస్తున్నారో రైతులకే తెలియదని బీజేపీ ఎంపీ హేమా మాలిని అన్నారు. అగ్రి చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడాన్ని ఆమె స్వాగతించారు. దీని వల్ల ఉద్రిక్తతలు కాస్త తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌‌లో రైతులు టవర్లను కూల్చడం సరికాదన్నారు.

‘అగ్రి చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించడం శుభపరిణామం. ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితులు తగ్గడానికి దోహదపడొచ్చు. పలు దఫాల చర్చలు జరిగిన తర్వాత కూడా రైతులు ఓ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అసలు తమకేం కావాలో అన్నదాతలకు క్లారిటీ లేదు. కొత్త చట్టాలతో వచ్చే సమస్య ఏంటనేది కూడా వారికి స్పష్టత లేదు. ఎవరో చెప్పడం వల్లే రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలతో పంజాబ్ తీవ్రంగా నష్టపోయింది. అక్కడ రైతులు టవర్లను కూల్చేశారు. అన్నదాతలు అలా చేయడం సరికాదు. ప్రభుత్వం పలుమార్లు చర్చలకు పిలిచినప్పటికీ రైతులకు ఓ ఎజెండా అనేది లేకుండా పోయింది. అందుకే చర్చలు విఫలమయ్యాయి’ అని హేమా మాలిని పేర్కొన్నారు.

Latest Updates