కవిత ఓటమికి కక్ష సాధింపే యూరియా కొరత : ఎంపీ అర్వింద్

పార్లమెంట్ ఎన్నికల్లో రైతులు బీజేపీ పక్షాన నిలిచినందుకే నిజామాబాద్ జిల్లా రైతులకు యూరియా కష్టాలు కలిగిస్తున్నారని ఆరోపించారు..ఎంపీ అర్వింద్. కవిత ఓటమికి కక్ష సాధింపుగా యూరియా కొరత సృష్టిస్తున్నారన్నారు. కేంద్రం నుంచి సరిపడ యూరియా వస్తున్నా పంపిణీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ గెలిపించినందుకు ప్రజలకు యూరియా కొరత రూపంలో కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. దుబ్బాక రైతు మృతి పట్ల వ్యవసాయ శాఖ మంత్రి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఇందల్వాయిలో ఓ మహీళా రైతు సొసైటీ వద్ద యూరియా కోసం క్యూలో నిలబడి సొమ్మసిల్లి పడిపోవడంతో స్పందించిన అరవింద్ ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నారు..

Latest Updates