రైతుల మేలు కోసం సీఎం కేసీఆర్ కృషి

యాదాద్రి భువనగిరి జిల్లా : రాష్ర్టంలో కొత్త రెవెన్యూ చ‌ట్టం తీసుకువ‌స్తూ సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం కృషి చేస్తున్నార‌ని తెలిపారు భువనగిరి మండల రైతుబంధు కన్వీనర్ కంచి మల్లయ్య. రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్‌వో) వ్యవస్థను రద్దు చేసినందుకు యాదాద్రి జిల్లా భువనగిరి మండలంలోని వీరవెల్లి గ్రామాని చెందిన రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు టీఆర్ఎస్ నేతలు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కంచి లలిత, టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తోటకూరి పరమేష్, మాజీ ఎంపీటీసీ చింతల శ్రీనివాస్ రెడ్డి, మాజీ సర్పంచ్ రేగు వెంకటేష్, స్థానిక పీఏసీఎస్ డైరెక్టర్లు తోటకూరి శంకరయ్య, చింతల వెంకట్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Latest Updates