ఆందోళన విరమించిన మహా రైతులు

కనీస మద్దతు ధర, రుణమాఫీ కోరుతూ చేపట్టిన ఆందోళనను విరమించారు మహారాష్ట్ర రైతులు. మూడు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆందోళన విరమిస్తున్నట్టు ప్రకటించారు. మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ తో రైతు నాయకులు సమావేశమయ్యారు. తమ సమస్యలను మంత్రికి వివరించారు. రుణమాఫీ చేయడంతో పాటు.. స్వామినాథన్  కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కోరారు.

 

 

Latest Updates