ఆత్మనిర్భర్ భారత్‌‌కు రైతులే ఆయువుపట్టు

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ నెల వారీ రేడియో షో అయిన మన్ కీ బాత్‌‌లో ఆదివారం పలు విషయాలపై మాట్లాడారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు రైతుల ప్రాధాన్యతను ఆయన చెప్పుకొచ్చారు. రూరల్ ఇండియాలో చాలా పాపులర్ స్టోరీ టెల్లింగ్ ట్యాలెంట్ దాగుందన్నారు. ‘మానవ నాగరికతకు ఎంత చరిత్ర ఉందో అంతే హిస్టరీ కథలు చెప్పడానికి ఉంది. ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడే కథ ఉంటుంది. ఒకరి వ్యక్తిత్వాన్ని సృజనాత్మకంగా చెప్పడానికి కథలు విశేషంగా ఉపయోగపడతాయి. ఆత్మనిర్భర్ భారత్‌‌ను నిర్మించడంలో రైతులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మన వ్యవసాయ రంగం తన పరాక్రమాన్ని చూపించింది. దేశ వ్యవసాయ రంగం, రైతాంగం, గ్రామాలు ఆత్మనిర్భర్ భారత్‌‌కు ఆయువుపట్టుగా చెప్పొచ్చు. సాంకేతికతను వాడటం ద్వారా వ్యవసాయ రంగం చాలా మెరుగవుతుంది’ అని మోడీ చెప్పారు.

Latest Updates