కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టిన రైతులు

Farmers protests at Warangal District collector office for passbooks

వరంగల్:  తమ భూములకు సంబంధించి పట్టా పాస్ పుస్తకాలు మంజూరు చేయాలంటూ వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామ రైతులు. పాస్ పుస్తకాల కోసం తహశీల్దార్ , రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లినా.. తమకు న్యాయం జరగలేదని, అందుకే అందోళన బాట పట్టామని వారు వాపోయారు. రోడ్లపై బైఠాయించి ఆందోళన తెలిపినా.. తమకు ఫలితం దక్కలేదని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని తమకు పాస్ బుక్ లు మంజూరు చేయాల్సిందిగా కోరారు.

Latest Updates