కాళ్లు మొక్కుతాం.. కందులు కొనండి

కందులను అమ్ముకునేందుకు మార్కెట్‌కు వచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదని.. దళారులతో చేతులు కలిపి దందా నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రంగారెడ్డి జిల్లా షాద్‌ నగర్‌ రైతులు. తాము తెచ్చిన కందులను కొనుగోలు చేయమని కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి నర్సింహారెడ్డి కాళ్లు మొక్కారు. ఈ క్రమంలో ఇన్‌ చార్జికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తమ కందులను కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో పట్టణ శివారులోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఎదుట పాత జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పోలీసులు రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. కాగా ఘటనపై విచారణ చేపడతామని ఐపీఎస్‌ అధికారిణి రితిరాజ్‌ రైతులకు హామీ ఇచ్చారు.

Latest Updates