నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

పామర్రు: నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. పామర్రు నియోజకవర్గంలో పంట పొలాలను పవన్ పరిశీలించారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఆయన ఓదార్చారు. ‘తుఫాన్ ప్రభావం రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన పంట చేజారిపోవడం బాధాకరం. రైతులకు అండగా మేం ఉన్నాం. అందుకే వారిని కలవడానికి వచ్చా. ప్రకృతి వైపరీత్యాల పై రాజకీయం చేయబోం. నేను ఓట్ల సమయంలో వచ్చి వెళ్లే వ్యక్తిని కాను. ఇప్పుడు ఎన్నికలు లేవు. క్షేత్రస్థాయిలో ప్రజల బాధలను తెలుసుకునేందుకే వచ్చా. కష్టపడి పండించిన పంట మొత్తం దెబ్బతింది. సొంతభూమి రైతులతోపాటు కౌలు రైతులకూ న్యాయం జరగాలి. రైతుల కన్నీళ్లు దేశానికి మంచిది కాదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని అదుకోవాలి. కర్షకుల కష్టాలు, కన్నీళ్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా’ అని పవన్ పేర్కొన్నారు.

Latest Updates