పాక్ వైపు చూసేది జితేంద్ర సింగే: ఫరూఖ్ అబ్దుల్లా కౌంటర్

farooq abdullah counter on jitendra singh

farooq abdullah counter on jitendra singhన్యూఢిల్లీ: కశ్మీరీ నేతలపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉంటే భారత్ వైపు, లేకపోతే పాక్ వైపు చూస్తారనడాన్ని ఖండించారు. అసలు జితేంద్ర సింగ్ ఏం మంత్రి, ఆయన మాట్లాడిన తీరేంటి అంటూ మండిపడ్డారు ఫరూఖ్. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలానేనా మాట్లాడేది అన్నారు. ఆయన మాట్లాడిన దానికి సాక్ష్యం ఉండాలని చెప్పారు. తాను భారతీయుడిని కాదని ఎప్పుడు అన్నానో చెప్పాలన్నారు. జితేంద్ర సింగ్ లాంటోళ్లే పాకిస్థానీనని చెప్పుకుంటారని, ఫరూఖ్ అబ్దుల్లా కాదని చెప్పారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చేది అలాంటి వారేనని అన్నారు.

 

Latest Updates