పార్టీ నేతలను కలిసిన ఫరూఖ్ అబ్దుల్లా

2 నెలల నిర్భందం తర్వాత తన పార్టీ నేతలను కలుసుకున్నారు జమ్మూకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా. పార్టీ జమ్మూ ప్రాంత ప్రతినిధులు… ఫరూఖ్ అబ్దుల్లాను కలిశారు. తమ పార్టీ అధినేతను కలిసేందుకు అవకాశమివ్వాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను కోరగా… ఆయన పర్మిషన్ ఇచ్చారు.

ముందు ఒమర్ అబ్దుల్లాను కలిసిన నేతలు… తర్వాత ఫరూఖ్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఒమర్, ఫారూఖ్ లు ఆరోగ్యంగానే ఉన్నారని పార్టీ నేత దేవేంద్ర రాణా చెప్పారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాల పట్ల వారు బాధపడుతున్నారన్నారు. అయితే ఒమర్ అబ్దుల్లా, ఫరూఖ్ అబ్దుల్లాలు ఇంకా గృహ నిర్భంధంలోనే ఉన్నారు.

Latest Updates