సమత దోషులకు శిక్ష తప్పదు

ఖానాపూర్, వెలుగు: సమత పిల్లల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జాతీయ బాలల కమిషన్ మెంబర్ ప్రజ్ఞా పాండే అన్నారు. శుక్రవారం రాత్రి కేంద్ర, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. సమత భర్త, ఇద్దరు పిల్లలతో మాట్లాడారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అందిన లబ్ధిపై ఆరా తీశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుమ్రంభీం ఆసిఫాబాద్​జిల్లాలో హత్యాచారానికి గురైన సమత ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరుగుతుందన్నారు. దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని  పేర్కొన్నారు. సమత పిల్లలు ఏ స్కూల్లో  చదువుకుంటారో వారినే నిర్ణయించుకోమని సూచించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మెంబర్ శోభారాణి, నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు, ఏఎస్పీ శ్రీనివాస్ రావ్, ఐసీడీఎస్ జిల్లా పీడీ రాజమౌళి, సీఐ జయరామ్ తదితరులు ఉన్నారు.

Latest Updates