రిజిస్టర్‌ చేసేటప్పడే ఫాస్టాగ్‌ డిటైల్స్‌‌

న్యూఢిల్లీ: వెహికల్స్ ‌ను రిజిస్టర్‌ చేసేటప్పుడు లేదా ఫిట్‌‌నెస్‌ సర్ఫిటికేట్‌‌ను ఇష్యూ చేసేటప్పుడు ఫాస్టాగ్‌‌ డిటైల్స్ ను తీసుకోవాలని ప్రభుత్వం ఎన్‌‌ఐసీని అడిగింది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ‌టోల్‌ కలెక్షన్‌‌(ఎన్ఈటీసీ), వాహన్‌‌ పోర్టల్ లను ఇంటిగ్రేట్‌ ‌చేయడం పూర్తయ్యిందని నేషనల్‌ ఇన్ఫర్‌మేటిక్స్ ‌సెంటర్‌(ఎన్‌‌ఐసీ)కి రాసిన లెటర్‌లో రోడ్డు ట్రాన్స్ ‌పోర్ట్‌‌ మినిస్ట్రీ పేర్కొంది. ఫాస్టాగ్స్‌‌లోని డిటైల్స్ ను వెహికల్ ఐడెంటిఫికేషన్‌ ‌నెంబర్‌ లేదా వెహికల్‌ రిజిస్ట్రేషన్ నెంబర్‌ ద్వారా ‘వాహన్’ సిస్టమ్‌ పొందడానికి వీలుంటుంది. రేడియో ఫ్రిక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ‌(ఆర్‌ఎఫ్‌ఐడీ) టెక్నాలజీని ఫాస్టాగ్‌‌లో వాడుతుండడం వలన దీనికి లింక్‌‌ అయి ఉన్న ప్రీపెయిడ్‌ ‌లేదా సేవింగ్స్ అకౌంట్స్‌‌ నుంచి నేషనల్‌ హైవేస్‌ టోల్‌ పేమెంట్స్ ‌డిడక్ట్‌‌ అవుతాయి. ప్రీపెయిడ్‌ ‌ట్యాగ్‌‌ను వెహికల్స్‌కు విండ్‌ ‌స్క్రీన్‌‌కు ఫిక్స్ ‌చేయడం వలన టోల్‌ గేట్స్ వద్ద ఆటోమెటిక్‌‌గా టోల్‌ పేమెంట్స్‌‌ డిడక్ట్ అయిపోతాయి.

Latest Updates