130 కి.మీ.ల స్పీడ్‌తో దూసుకెళ్లనున్న ప్యాసింజర్ ట్రెయిన్స్

న్యూఢిల్లీ: మన రైళ్లు త్వరలో మరింత వేగంగా దూసుకెళ్లనున్నాయి. ఇందుకోసం రైల్వేస్‌లోని గోల్డెన్ క్వాడ్రిలాటెరల్ ఆర్మ్స్‌ను అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి పీయూశ్ గోయల్ నిర్ణయించారు. అలాగే ప్యాసెంజర్ ట్రెయిన్స్‌ను వేగంగా నడిపేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ చెప్పిన దాని ప్రకారం.. ప్రస్తుత ఫైనాన్షియల్ ఇయర్ ముగిసేలోపు ఆరు మేజర్ రూట్లను రైల్వేస్ అప్‌గ్రేడ్ చేయనుంది. తద్వారా గంటకు130 కి.మీ.ల వేగంతో ప్యాసింజర్ రైళ్లను నడపనున్నారని తెలుస్తోంది.

‘ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా గోల్గెన్ క్వాడ్రిలాటెరల్‌తోపాటు మిగతా రూట్లను అప్‌గ్రేడ్ చేయాలని కృత నిశ్చయంతో ఉన్నాం. తద్వారా ప్యాసింటర్ ట్రెయిన్స్‌ వేగాన్ని 130 కి.మీ.లకు పెంచాలని అనుకుంటున్నాం’ అని ఆన్‌లైన్ ప్రెస్ మీట్ సందర్బంగా యాదవ్ తెలిపారు. వీటితోపాటు ఇండియన్ రైల్వేస్ మరికొన్ని ప్రాజెక్టులపై కూడా పని చేస్తోంది. రూ.13 వేల కోట్లతో ఢిల్లీ‌‌–ముంబై, ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–చెన్నై, ముంబై–చెన్నై, హౌరా–చెన్నై, ముంబై–హౌరా ప్రాజెక్టుల రూట్ అప్‌గ్రేడేషన్, విస్తరణను పెంచడంపై దృష్టి పెట్టింది. తద్వారా ఆయా రూట్స్‌లో ప్యాసెంజర్ రైళ్లను 160 కి.మీ.ల వేగంతో నడపాలని డిసైడ్ అయింది. 2023 వరకు ఢిల్లీ‌‌–ముంబై, ఢిల్లీ–హౌరా ప్రాజెక్టు పనులు పూర్తవనున్నాయి. దీంతో  ఈ రూట్లలో ప్రయాణ సమయం గరిష్టంగా తగ్గనుంది.

రైళ్ల వేగాన్ని పెంచడానికి ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను రైల్వేస్ వాడుతోంది. అయితే మేక్‌ ఇన్ ఇండియాలో భాగంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ సుమారు 180 కి.మీ.ల వేగాన్ని అందుకుంది. దీంతో మన రైల్వేస్‌కు తగ్గట్లుగా ఉండే వందే భారత్ రైళ్లను మరిన్నిటిని తయారు చేయాలని నిర్ణయించారు. తమ నెట్‌వర్క్‌లో ప్రైవేటు సెక్టార్‌‌ కూడా ట్రెయిన్స్‌ను నడపాలని రైల్వేస్ ఆశిస్తోంది. 2023లో తొలి ప్రైవేటు ట్రెయిన్ ఇండియన్ రైల్వేస్ ట్రాక్స్‌పై దూసుకెళ్లనుందని అంచనా వేస్తున్నారు.

Latest Updates