Cricket World Cup 2023: సచిన్‌,డివిలియర్స్‪ని వెనక్కి నెట్టిన వార్నర్.. వరల్డ్ కప్‪లో ఆల్ టైం రికార్డ్

Cricket World Cup 2023: సచిన్‌,డివిలియర్స్‪ని వెనక్కి నెట్టిన వార్నర్.. వరల్డ్ కప్‪లో ఆల్ టైం రికార్డ్

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ మొదలైందో లేదో అప్పుడే రికార్డులు వచ్చి చేరుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా ఆస్ట్రేలియా ఓపెనర్ వార్నర్ ఒక  ఆల్ టైం రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. వరల్డ్ కప్ చరిత్రలో వేగంగా 1000 పరుగులు చేసి సచిన్, డివిలియర్స్ రికార్డుని బ్రేక్ చేసాడు. వార్నర్ వ్యక్తిగత స్కోర్ 8 పరుగుల వద్ద ఈ ఘనతను అందుకున్నాడు.  

1000 పరుగులను చేరుకోవడానికి వార్నర్ కి కేవలం 19 ఇన్నింగ్స్ లు మాత్రమే అవసరమయ్యాయి. ఇప్పటివరకు ఈ రికార్డ్  భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాటర్ డివిలియర్స్ పేరిట ఉంది. వీరిద్దరూ కూడా వరల్డ్ కప్ లో 1000 పరుగుల మార్క్ అందుకోవడానికి 20 ఇన్నింగ్స్ లు పట్టాయి. తాజాగా భారత్ పై జరుగుతున్న మ్యాచులో వార్నర్ ఈ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. 

ALSO READ :Cricket World Cup 2023:  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా.. తొలి మ్యాచుకు గిల్ దూరం

ఇక వార్నర్ రికార్డ్ ఈ మ్యాచులో బద్దలు కొట్టే అరుదైన అవకాశం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఉంది. ఇప్పటివరకు రోహిత్ శర్మ 17 ఇన్నింగ్స్ ల్లో 978 పరుగులు చేసాడు. మరో 22 పరుగులు చేస్తే ఈ రికార్డ్ రోహిత్ ఖాతాలోకి వెళ్తుంది. కాగా.. మ్యాచ్ విషయానికి వస్తే మొదటి 7 ఓవర్లలో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 29 పరుగులు చేసింది. బుమ్రా  బౌలింగ్ లో మార్ష్ డకౌటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో వార్నర్ (14), స్మిత్ (15) ఉన్నారు.