కొడుకుకు జబ్బు ఉందని.. వదిలేసి మరో పెళ్లి చేసుకున్న తండ్రి

వికారాబాద్: కొడుకుకు తలసేమియా వ్యాధి ఉందని భార్య, కొడుకుల‌ను వ‌దిలేశాడో తండ్రి. వికారాబాద్ జిల్లా దోమ మండలం చర్ల తండాకు చెందిన ఓ వ్యక్తి తన కుమారుడికి తలసేమియా వ్యాధి ఉందని భార్యా కొడుకును వదిలేసి.. మరో మహిళను పెళ్ళి చేసుకొని దర్జాగా తిరుగుతున్నాడు. దీంతో బాధిత మహిళ తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం జరగకపోతే కొడుకుతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మహిళ వేడుకుంది.

Latest Updates