కామారెడ్డిలో దారుణం : ఆర్థిక ఇబ్బందుల వల్ల కూతురుకు థమ్సప్ లో పురుగుల మందు ఇచ్చి..

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుమస్తా కాలనీ శివారులోని గోసంగి కాలనీలో ఓ తండ్రీ కూతరు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. కుమార్తె సైరా బేగం (14) కు పురుగుల మందు కలిపి థమ్స్ ప్ లో తాగించి తాను ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకున్నాడు తండ్రి ఎస్ కే అక్బర్ (48). ఐదేళ్ల క్రితం తండ్రీ కూతుళ్ళను వదిలి వెళ్లి దూరంగా ఉంటుంది అక్బర్ భార్య. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates