సిద్దిపేటలో దారుణం.. సైకో తండ్రి ఇద్దరు కూతుళ్ల గొంతు కోశాడు

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. దుబ్బాక మండలం చిట్టాపూర్ లో ఇద్దరు కూతుళ్లపై తండ్రి మహ్మద్ దాడి చేశాడు. మద్యం మత్తులో ఉన్న మహ్మద్ ఉదయం నుంచి కుటుంబసభ్యులతో గొడవపడుతున్నాడని స్థానికులు తెలిపారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రావడంతో.. మరింత రెచ్చిపోయిన అతడు.. ఇద్దరు కూతుళ్ళ గొంతు కోశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. ఇద్దరు చిన్నారులను సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 ఏళ్ల నుంచి మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మహ్మద్ మిరిదొడ్డి మండలం మోతెలో నివాసమున్నాడు. మహ్మద్ కొన్ని రోజుల నుంచి సైకోలా ప్రవర్తిస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీంతో చిట్టాపూర్ లో ఉంటున్నాడు.

సిటీలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు.!

Latest Updates