ఎగ్జామ్ కు వెళ్లిన తల్లి..జో కొట్టిన తండ్రి

ఏడస్తున్న చిన్నారికి  అన్నీ తానయ్యాడు ఓ తండ్రి. తల్లి ఎగ్జామ్ కు వెళ్లడంతో  జోలపాట పాడుతూ ఊయలలో ఆడిస్తున్నాడు  ఆ తండ్రి.  సికింద్రాబాద్  గాంధీ వైద్య కళాశాలలో నర్సింగ్ ఎగ్జామ్ కోసం ఆదిలాబాద్ నుంచి నరసింహన్ అనే దంపతులు వచ్చారు. తల్లి ఎగ్జామ్ రాసేందుకు వెళ్లింది. ఆ చిన్నారి ఏడుస్తుండటంతో  ఆస్పత్రి ఆవరణలో ఉన్న రెండు చెట్లకు చీరతో ఉయ్యాల తయారు చేసి జో కొడుతూ ఆ బుజ్జాయిని ఆడిస్తున్నాడు  తండ్రి.

 

 

Latest Updates