మంత్రి కేటీఆర్ సాయంతో తండ్రి అంత్యక్రియలకు

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మురళీ అనే రైతు గుండెపోటుతో చనిపోయాడు. అయితే మృతుడి కొడుకు అరవింద్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి చనిపోయాడని తెలుసుకున్న కుమారుడు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బెంగళూరు నుంచి బయలు దేరాడు. అయితే లాక్ డౌన్ కారణంగా రావడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు. ఎలాగైనా తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలంటూ స్థానిక ఎమ్మెల్యేకు విజ్జ్ఞప్తి చేశాడు అరవింద్. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. విషయం పై స్పందించిన కేటీఆర్ చర్యలు చేపట్టారు. అరవింద్ రావడానికి బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనాన్ని సమకూర్చాల్సిందిగా అధికారులకు  ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెహికిల్ లో అరవింద్ బెంగళూరు నుంచి బయలు దేరాడు అరవింద్.  మంత్రి కేటీఆర్ కు కృతజజ్ఞతలు తెలిపాడు.

Latest Updates