తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు ఆత్మహత్యాయత్నం

తండ్రి చనిపోయిండని..కిరోసిన్​ పోసుకుని కాల్చుకున్న కూతురు

రాజాపేట, వెలుగు: తండ్రి మరణాన్ని తట్టుకోలేక కూతురు ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురంలో మంగళవారం చోటుచేసుకుంది. రఘునాధపురం గ్రామానికి చెందిన బోగ వెంకటేశ్​(57)కు భార్య, ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. సోమవారం సాయంత్రం వెంకటేశ్​అనారోగ్యానికి గురవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.

మంగళవారం ఉదయం వెంకటేశ్ మరణించాడు. తండ్రి మరణవార్త విన్న కూతురు నవనీత(24 ) నాన్న లేని జీవితం నాకొద్దంటూ బాత్రూమ్ లోకి వెళ్లి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన బంధువులు, గ్రామస్తులు వెంటనే మంటలు ఆర్పి ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. శరీరభాగాలు ఎక్కువ శాతం కాలిపోవడంతో మెరుగైన చికిత్స కోసం గాంధీకి తరలించారు.

See Alos: ఫీల్డ్​ అసిస్టెంట్లపై ప్రభుత్వం కఠిన నిర్ణయం

రైతు రుణమాఫీ: అర్హులను ఇలా గుర్తిస్తారు

ఇంటర్​ క్వశ్చన్ ​పేపర్లలో తప్పులే తప్పులు

నిజామాబాద్ ఎమ్మెల్సీ బరిలో కవిత

Latest Updates