కొడుకు, కోడలి చేతిలో తండ్రి హతం

కుటుంబ కలహాలతో నరికి చంపిన వైనం

అనంతపురం: కనగానపల్లి మండలం మామిళ్లపల్లి లో తండ్రిని కొడుకు, కోడలు కలసి దారుణంగా చంపిన ఘటన చోటు చేసుకుంది. కుటాంబానికి పెద్ద దిక్కు లాంటి నారాయణస్వామి (50)పై  కోపంతో కొడవలితో దాడికి సిద్ధమైన కొడుకు గణేష్ కు అతని భార్య అనిత కూడా సహకరించింది. కొడవలితో నరకడంతో తవ్ర రక్తగాయాలై నారాయణస్వామి కుప్పకూలి చనిపోయాడు. తండ్రిని చంపిన గణేష్ తన అన్న గంగాధర్ కు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నిన్న రాత్రి జరిగిన దారుణమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

తన రెండో కొడుకు గణేష్ చేతిలో చనిపోయిన నారాయణస్వామి(50) నర్సరీ పెట్టుకుని… ఊరూరు తిరుగుతూ మొక్కలు అమ్మేవాడు. ఇదే క్రమంలో మూడ్రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి తిరిగొచ్చాడు. మూడు నెలల క్రితమే తన రెండో కొడుకు గణేష్ కు అనిత అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశాడు. ఏదైనా పనిచేసుకుని భార్య అనితను పోషించాల్సిన గణేష్ పెళ్లికి ముందు లాగే జులాయిగా తిరుగుతూ.. బాధ్యత లేకుండా ప్రవర్తించేవాడు. డబ్బు కోసం తండ్రి నారాయణస్వామితో తరచూ గొడవలు పడుతుండేవాడని స్థానికుల సమాచారం. నిన్న రాత్రి వాగ్వాదం జరిగిన కాసేపటికే  గడ్డి కోసే కొడవలితో దాడికి దిగాడు. కొడుకు చేతిలో కొడవలి దెబ్బల నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించిన తండ్రి నారాయణస్వామికి కోడలు అడ్డుకుంది. తండ్రిపై కోపంతో రగలిపోతున్న భర్తకు సహకరించడంతో కత్తిపోట్లకు గురై కన్నుమూశాడు.

Latest Updates