మందుకోసం పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని 19 ఏళ్ల కొడుకుని..

కరోనావైరస్ వ్యాపిస్తుందని దేశమంతా లాక్డౌన్ విధించారు. దాంతో షాపులన్నీ మూతపడ్డాయి. ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయినా తమ మంచికోసమే కదా అని ఓపికగా ఉంటున్నారు. అయితే మందుబాబులకు మాత్రం లాక్డౌన్ వల్ల పిచ్చెక్కిపోతుంది. మందు దొరకక పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. మందు దొరకక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే వారి కేసులు ఆస్పత్రుల్లో ఎక్కువయ్యాయి.

తాజాగా పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లిలో కూడా అటువంటి ఘటనే చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాహుల్ (19)అనే యువకుడు మద్యానికి బానిసై వింతవింతగా ప్రవర్తిస్తున్నాడు. దాంతో బుధవారం రాత్రి రాహుల్ తండ్రి ముత్యాల రవి కొడుకుతో గొడవకు దిగాడు. ఈ వయసులోనే మద్యానికి బానిసై ఇలా చేస్తున్నావెందుకు అని రవి గొడవపడ్డాడు. కొడుకు లొల్లి ఎక్కువకావడంతో సహనం కోల్పోయిన రవి.. ఇంటి ముందున్న ఇనుప పైపుతో రాహుల్ ను కొట్టాడు. దాంతో తీవ్ర రక్తస్రావమై రాహుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. రవిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

బస్సును మొబైల్ ఫీవర్ క్లినిక్‌గా మార్చిన ఆర్టీసీ

జవాన్లపై ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కు అనారోగ్యం

Latest Updates