సూర్యాపేటలో దారుణం.. 40 ఏళ్ల కొడుకుని చంపిన 63 ఏళ్ల తండ్రి

సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని నాగారం మండలం పస్తాల గ్రామంలో కన్న కొడుకును తండ్రి కర్రతో కొట్టి హత్య చేశాడు. పస్తాల గ్రామానికి చెందిన బండగొర్ల ఈదప్ప(63), బండగొర్ల శ్రీశైలం(40) తండ్రీ కొడుకులు. వీరిద్దరూ తరచుగా గొడవపడుతుండేవారని స్థానికుల సమాచారం. అదే క్రమంలో మంగళవారం రాత్రి 9 గంటలకు సమయంలో వీరిద్దరూ ఇంటిముందు వీధిలో గొడవపడ్డారు. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో కొడుకు శ్రీశైలం తండ్రి ఈదప్పను వెనకనుంచి తన్నాడు. దాంతో కోపోద్రిక్తుడైన తండ్రి ఈదప్ప.. పక్కనే ఉన్న కర్రతో కొడుకు శ్రీశైలం మెడ పైభాగంలోని బలంగా కొట్టాడు. దాంతో శ్రీశైలం తలకు బలమైన గాయమై.. చెవిలో నుంచి రక్తం కారుతూ కిందపడి చనిపోయాడు. అనుకోకుండా జరిగిన దాడిలో శ్రీశైలం చనిపోవడంతో.. తండ్రి ఈదప్ప అక్కడి నుంచి పరారయ్యాడు. మృతుడు శ్రీశైలంకి భార్య సునీత, ముగ్గురు పిల్లలు గౌతమి, పల్లి, మహేష్ ఉన్నారు. శ్రీశైలం మరణంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తన్నారు. యాదవులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న గొర్రెల పంపిణీ యూనిట్లకు శ్రీశైలం గ్రామ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఈదప్ప కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

For More News..

మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

రాజ్యసభ నుంచి 11 మంది ఎంపీలు రిటైర్.. వాళ్లు ఎవరంటే?

సీసీటీవీ ఫుటేజ్: అబిడ్స్‌లో ఆక్సిడెంట్.. క్షణాల్లో గాలిలో కలిసిన ప్రాణాలు

Latest Updates