తాగి వేధిస్తున్నడని కొడుకును చంపేసిండు

గోదావరిఖని, వెలుగు: మద్యానికి బానిసై నిత్యం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధిస్తున్న కొడుకును బండరాయితో కొట్టి చంపేశాడో తండ్రి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్‌‌ కాలనీ పరిధిలోని ఇందిరానగర్‌‌లో చోటుచేసుకుంది. నడిగోట మల్లయ్య కుమారుడు గణేష్‌(35) వివాహం 11 సంవత్సరాల క్రితం స్వరూపతో జరిగింది. గణేష్‌‌ తాగుడుకు బానిసై భార్యను వేధిస్తుండడంతో రెండేళ్ల క్రితం ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఆనాటి నుంచి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్న గణేశ్‌‌ మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని వారిని వేధించేవాడు. గురువారం ఉదయం డబ్బుల గురించి ఇంట్లో గొడవ జరగగా తల్లిదండ్రులను గణేశ్‌‌ కొట్టాడు. తట్టుకోలేకపోయిన తండ్రి కొడుకుని చంపాలని నిర్ణయించుకుని ఇంటి బయట ఉన్న సిమెంట్‌‌ ఇటుకను తెచ్చి ఇంట్లో దాచి పెట్టాడు. గురువారం రాత్రి 11.20 గంటల సమయంలో మద్యం తాగి ఇంటికి వచ్చిన గణేశ్‌‌కు, తండ్రి మల్లయ్యకు మధ్య గొడవ జరిగింది. తోపులాటలో గణేశ్​ కిందపడ్డాడు. ఇదే అదనుగా తండ్రి సిమెంట్‌‌ ఇటుకతో అతని తలపై బలంగా కొట్టడంతో తీవ్రగాయాలతో అక్కడికక్కడే చనిపోయాడు. పథకం ప్రకారం తన భర్త గణేశ్‌‌ను మామ ఇటుకతో కొట్టి చంపాడని, అతనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదావరిఖని టుటౌన్‌‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

10 వేల మందిపై వ్యాక్సిన్ ట్రయల్స్

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమెజాన్‌లో కొలువుల జాతర

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

Latest Updates