తండ్రి ఆకృత్యాలనుంచి తప్పించుకున్న కూతురు

father-rapes-miner-daughter-in-rajendra-nagar-hyd

రాజేంద్రనగర్,వెలుగు: స్నేహితుల సహాయంతో కన్న తండ్రి ఆకృత్యాల నుంచి తప్పించుకుంది ఓ కూతురు. తండ్రి చేతిలో అత్యాచారినికి గురైన  ఆ కూతురు స్నేహితులు ఇచ్చిన ధైైర్యంతో బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

రాజేంద్రనగర్ సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వర్లుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యవెంకటేశ్వర్లు కు దూరంగా సూర్యాపేటలో ఉంటుంది. అప్పుడప్పుడు మొదటి భార్య వద్దకు వెళ్లే వెంకటేశ్వర్లు తన కూతురిని లోబరుచుకోని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బేదిరించాడు.

కూతురి శరీరంలో మార్పులు గుర్తించిన తల్లి, బంధువులు బాధితురాలిని విషయం అడిగినా చెప్పలేదు. తన స్నేహితురాళ్లు ధైర్యం చెప్పడంతో తనతండ్రి వెంకటేశ్వర్లు తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసి రాజేంద్రనగర్ పోలీసులు విచారిస్తున్నారు. బాధితురాలిని చైల్డ్ అధికారుల సహాయంతో పరీక్షలు నిర్వహించి ధర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలిని చైల్డ్ ప్రొటెక్షన్ గృహానికి తరలించినట్లు తెలిపారు.

Latest Updates